![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -306 లో.. కృష్ణ జ్వరంతో బాధపడుతుండటం చూసిన మురారి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. తోడుగా ముకుంద కూడా వెళ్తుంది. అలా ముగ్గురు వెళ్ళడం చూసిన రేవతి.. వాళ్ళ ఇద్దరి మధ్యలో ముకుంద ఎందుకు వెళ్లినట్టని మధుతో అనగానే.. ముకుంద వెళ్లిన ఏం చెయ్యలేదని మధు అంటాడు.
మరొక వైపు కృష్ణని మురారి తన హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. నీకు ఈ హాస్పిటల్ ఎలా తెలుసని మురారిని ముకుంద అడుగుతుంది. నాకు ఇక్కడే ట్రీట్ మెంట్ జరిగిందని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ నడవలేని స్థితిలో ఉంటే మురారి కృష్ణని ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్తాడు. అది చూసిన ముకుంద ఓర్వలేకపోతుంది. లోపలికి వెళ్ళాక అక్కడ పరిమళ మేడమ్ ఉంటుంది. వీడికి ఎప్పుడు గతం గుర్తుకు వస్తోందో? గతం గుర్తు చెయ్యడానికి ఎవరు ప్రయత్నం చెయ్యడం లేదా అనుకుంటుంది. ఎక్కడ పరిమళ గతం గుర్తుకు చేస్తుందోనని ముకుంద టెన్షన్ పడుతుంది. మురారి మాత్రం ఈ డాక్టర్ ని ఎక్కడో చూసానని అనుకుంటాడు. మురారికి గతం గుర్తుకు చెయ్యట్లేదా అని ముకుందని పరిమళ మేడమ్ అడుగుతుంది. లేదు ఎక్కడ మీరు చెప్పేస్తారోనని టెన్షన్ పడ్డానని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ స్పృహ లోకి రాగానే బంధం అంటే ఇదేనేమో నువ్వు ఎదురుగా ఉంటే గతం గుర్తుకు చేయాల్సిన అవసరం లేదు. అదే గుర్తుకు వస్తుందని పరిమళ అనగానే కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మురారి వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూసానని అడుగుతాడు. మీరు ఇంజక్షన్ గురించి గొడవ చేశారు కదా అప్పుడు చూసి ఉంటారని పరిమళ కవర్ చేస్తుంది.
ఆ తర్వాత మురారి వాళ్ళు హాస్పిటల్ నుండి బయలుదేరతారు. ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాననిపిస్తుందని మురారి అంటాడు. కృష్ణ ఏం తినలేదు కదా వెళదామని మురారి అంటాడు. ఇక ముగ్గురు లోపలికి వెళ్తారు. మురారి ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తుందని, అదే సమయంలో అక్కడికి గతంలో కృష్ణ ముకుంద మురారి వచ్చినప్పుడు బెట్ కట్టిన బ్యాచ్ లో ఒకరు వచ్చి కృష్ణ ముకుందలని చూసి.. అప్పుడు నేను తన వల్లే బెట్ గెలిచాను.. రూపం మారి ఉన్న మురారిని చూసిన కానీ అతను ఎవరు అనుకుంటాడు. వాళ్లని అలాగే చూస్తుంటే ముకుంద తనని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత మురారిని అమెరికా పంపించడం ఇష్టం లేదని రేవతి చెప్తుంది. అసలు దీని అంతటికి కారణం ఆ కృష్ణ.. ఆ కృష్ణ మురారి జీవితంలో లేకుంటే ఇదంతా జరిగేది కాదని భవాని అంటుంది. మురారిని ముకుందతో అమెరికాకి పంపిస్తుందా? కృష్ణకి అన్యాయం జరగనుందా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |